ఆ పొజిషన్‌లో వైభవ్ ఆడలేకపోతున్నాడు.. గౌతమ్ గంభీర్‌కు అశ్విన్ కీలక సూచన

ఆ పొజిషన్‌లో వైభవ్ ఆడలేకపోతున్నాడు.. గౌతమ్ గంభీర్‌కు అశ్విన్ కీలక సూచన

Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అరంగేట్రం చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. గాయపడిన ఇషాన్ కిషన్ స్థానంలో జట్టులోకి వచ్చిన వైభవ్‌ను నేరుగా మూడో స్థానంలో (No. 3) బ్యాటింగ్‌కు దించగా, అతను 8 బంతుల్లో కేవలం 4 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. వైభవ్ ఆటపై టీమిండియా మాజీ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) విశ్లేషిస్తూ టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని, మైదానంలో నెలకొన్న పరిస్థితులను ఆసక్తికరంగా సమీక్షించారు.

బ్యాటింగ్ చేసేందుకు విలవిలలాడిన వైభవ్: 

మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. వైభవ్‌ సూర్యవంశీకి ఈ మ్యాచ్ ఒక మిస్ (Miss).. అతను నెంబర్-3లో బ్యాటింగ్‌కు వచ్చేసరికి నీటిలో నుంచి బయటకు పడ్డ చేపలా (Fish out of water) ఇబ్బంది పడ్డాడు. తనకు అలవాటు లేని స్థానంలో ఆడుతున్నప్పుడు ప్రతి బంతిని బలంగా బాదడానికే ప్రయత్నించాడు గానీ టైమింగ్ చేయలేకపోయాడు. అలాంటి ఒత్తిడి సమయంలో మైదానంలో ఉన్న సీనియర్ బ్యాటర్ (సంజు శాంసన్) అతని దగ్గరకు వచ్చి ప్రశాంతంగా ఉండు, బంతిని దగ్గరగా చూసి ఆడని చెప్పాల్సింది. ఆ చిన్న సలహా వైభవ్‌ను స్థిరపడేలా చేసేదని అశ్విన్ పేర్కొన్నాడు. 

గౌతమ్ గంభీర్‌కు అశ్విన్ కీలక సలహా:

ఒకవేళ సంజు శాంసన్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ మూడో స్థానంలో ప్లేయింగ్ 11లో ఆడాల్సి వస్తే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాలని గంభీర్ సేనకు రవిచంద్రన్ అశ్విన్ సూచించారు. వైభవ్‌ను ఓపెనర్‌గా పంపి, శాంసన్‌ను నెంబర్ 3 స్థానానికి మార్చడం ఉత్తమం, గతంలో ఆసియా గేమ్స్‌లో కూడా సంజు మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. వైభవ్‌ను థర్డ్ ప్లేస్ లో  అతడికి సెట్ కాదని అశు తేల్చి చెప్పాడు. 

భారత మిడిల్ ఆర్డర్ డేంజరస్: 

అదే సమయంలో భారత మిడిలార్డర్ బ్యాటర్లైన తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, రమణ్‌దీప్ సింగ్ ల ప్రదర్శనను అశ్విన్ కొనియాడారు. ఇండియన్ మిడిల్ ఆర్డర్ (6, 7, 8 స్థానాలు) చాలా ప్రమాదకరంగా మారుతోంది. మిచెల్ శాంట్నర్ లాంటి అగ్రశ్రేణి స్పిన్నర్‌ను నిలబడి సిక్సర్లు కొట్టడం రమణ్‌దీప్ సింగ్ ఆత్మవిశ్వాసాన్ని తెలుపుతోంది. తిలక్ వర్మ ప్రశాంతత (Temperament) అద్భుతంగా ఉంది. ప్రత్యర్థి జట్లను భయపెట్టే రేంజ్ లో భారత మిడిల్ ఆర్డర్ తయారైందని రవిచంద్రన్ అశ్విన్ కొనియాడారు.