ఎస్సీ గురుకులాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. సీవోఈల్లో తాత్కాలిక ప్రాతిపదికన 117 పోస్టులు

ఎస్సీ గురుకులాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. సీవోఈల్లో తాత్కాలిక ప్రాతిపదికన 117 పోస్టులు

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిలో117 పోస్టుల భర్తీకి సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సొసైటీ పరిధిలో ఫౌండేషన్, స్పోర్ట్స్, సీవోఈల్లో (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ఐఐటీ, జేఈఈ, యూపీఎస్సీ, సీఎంఈ, క్లాట్ కోర్సులకు ట్రైనింగ్ ఇవ్వాలని నోటిఫికేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెక్రటరీ శారద పేర్కొన్నారు.

మ్యాథ్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీతో పాటు కాంపిటీటీవ్ కోర్సులకు మొత్తం 117 మంది అవసరం అని సెక్రటరీ స్పష్టం చేశారు. అర్హత, అనుభవం ఉన్న ఫ్యాకల్టీ సొసైటీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ నుంచి అప్లికేషన్ డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

ఈ నెల 30 లోగా సరూర్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని స్టేట్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో అందచేయాలని సెక్రటరీ ప్రకటించారు. తాత్కాలిక పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నామని, ముందస్తు సమాచారం లేకుండా తొలగించడంతో పాటు పోస్టుల సంఖ్య పెరగడం లేదా తగ్గడం ఉంటాయని నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు.