వారఫలాలు(జూన్28– జులై4) : పౌర్ణమి రోజు గ్రహాల మార్పు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

వారఫలాలు(జూన్28– జులై4) : పౌర్ణమి రోజు గ్రహాల మార్పు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

వారఫలాలు ( 2026 జూన్​28 నుంచి జులై4 వరకు): ఈ వారంలో శక్తివంతమైన పౌర్ణమి ఏర్పడుతుంది.గ్రహాలు.. వాటి స్థానాల మార్పు ఆధారంగా   జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం గ్రహాల మార్పుతో ఏ రాశి వారికి అదృష్టం కలిసి ఉంటుంది.  ఎవరికి అనూలంగా ఉంటుంది.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. 12 రాశుల వారి వారఫలాలను  తెలుసుకుందాం..!

మేషరాశి:  ఈ రాశివారికి ఈ వానం వృత్తి ఉద్యోగాల విషయంలో బాగా అనుకూలంగా ఉంది. ధన స్థానంలో కుజుడి సంచారం వలన ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం చేకూరే అవకాశం ఉంది,  నిరుద్యోగులకు మంచి జాబ్​ లభిస్తుంది.  వ్యాపారస్తులకు ఊహించని లాభాలు కలుగుతాయి. డబ్బు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

వృషభరాశి:  ఈ రాశి వారికి ఈ వారంలో శుక్రుడు తృతీయ స్థానంలో ఉండట వల ఆర్థిక విషయాల్లో పెరుగుదల ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వినోదాలకు బాగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలున్నాయి.  వృత్తి .. ఉద్యోగాల్లో  మీ ప్రాధాన్య పెరిగే అవకాశం ఉండి.  ప్రైవేట్​ ఉద్యోగస్తులు అవార్డులు అందుకొనే అవకాశాలున్నాయి.  సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడటం వలన పలుకుబడి పెరుగుతుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. . ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది..

మిథునరాశి: ఈ రాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు.  మీరు తీసుకున్న ఆలోచనలు అమలు చేస్తారు. . సకాలంలో రావలసిన డబ్బు సమకూరుతుంది. భూములు, వాహనాలు కొంటారు.  ఇప్పటి వరకు ఉన్న  ఒత్తిడుల నుంచి బయటపడతారు. వ్యతిరేకులను మీవైపు ఆకట్టుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో లబ్ధి పొందుతారు.  వ్యాపారులు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు అనుకూలిస్తాయి.

కర్కాటక రాశి:   ఈ వారం ఈ  రాశి వారికి  కుజుడి సంచారం వలన  ఆత్మవిశ్వాసం పెరుగుతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి.  ఖర్చులను నియంత్రించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.   ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు సమతుల్యంగా ఉంటాయి.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.  ఉద్యోగుల విషయంలో సహోద్యోగుల మద్దతుఉంటుంది. నిరుద్యోగులకు ఈ వారం మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.

సింహ రాశి:  ఈ రాశి వారికి ఈ వారం  అన్నివిధాల అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారస్తులకు వారం ప్రారంభంలో ఆందోళన కలిగిస్తుంది.  అయినా ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.  గతంలో మిమ్మలను విబేధించిన వారు  మీ దగ్గరకు రావలసిన పరిస్థితులు ఏర్పడుతాయి.  అయితే మీ జీవిత భాగస్వామి  ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి.  ఇక ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. 

కన్యారాశి:  లాభస్థానంలో రాశ్యధిపతి బుధుడి సంచారం వలన ఈ రాశి వారికి ఈ వారం  ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి . అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి.  ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు చేకూరుతాయి.  ఉద్యోగంలో స్థిరత్వం లభించే అవకాశం ఉంది. ఖర్చులు బాగా పెరుగుతాయి.  జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.  ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయని పండితులు చెబుతున్నారు. 

తులా రాశి:  ఈ రాశి వారికి ఈ వారంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.   వ్యాపారస్తులకు.. ఉద్యోగస్తులకు.. చేతి వృత్తుల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉద్యోగస్తులు పనిభారం పెరుగుతుంది.  కార్యాలయంలో  కీలకపాత్ర పోషించడంతో పాటు ఉన్నతాధికారుల ప్రశంశలు అందుకుంటారు.   ఉద్యోగం మారేందుకు అనుకూల సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఆదాయం తో పాటు.. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.   ప్రేమ వ్యవహారాలు హుషారుగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

వృశ్చికరాశి:  ఈరాశి వారి కి ఈ వారంలో  ఆర్థిక విషయంలో చాలా కాలంగా ఉన్న అడ్డంకులను అధిగమిస్తారు.   కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.  ఈ రాశి వారు ఏ ప్రయత్నం చేపట్టినా విజయ వంతం అవుతుంది.  డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఆస్తివివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి.. ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం బాగా పెరుగుతుంది.  ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి . ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు.నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.  

ధనుస్సు రాశి: ఈ రాశికి చెందిన వారికి ఈ వారం.. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి.  పాత స్నేహితులు కలవడంతో కొత్త ప్రాజెక్ట్​ లు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపార లావాదేవీల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.  మొండి బకాయిలు వసూలవుతాయి.  ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకునే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.   నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.  ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

మకరరాశి:  ఈ వారం  ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఈ వారం మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా పోతుంది. అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. ఉద్యోగంలో బాధ్యతల్లో  కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. చేపట్టిన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.  ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దని పండితులు సూచిస్తున్నారు.

కుంభరాశి:  ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుటుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.గతంలో రావలసిన సొమ్ము చేతికి వస్తుంది. ఉద్యోగస్తులు... వ్యాపారస్తులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.  జాబ్​ మారాలనుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది.  నిరుద్యోగులకు జాబ్​ ఆఫర్​ లభిస్తుంది. పూర్వీకుల  ఆస్తి కలసి వస్తుంది. నూతన వాహనయోగం ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

మీన రాశి:  ఈ   వారం ఈరాశి వారికి అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్ధిక విషయాల్లో కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.    డబ్బు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. వారం మధ్యలో లిక్విడ్ ఫండ్స్ పెరుగుతాయి.  ఇతరులతో మాట్లాడే విషయంలో అప్రమత్తంగా ఉండండి.  ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలుంటాయి.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు.  ప్రేమ... పెళ్లి విషయాలను తాత్కాలికంగా వాయిదా వేయండి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం