
మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ పరిధిలోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 23.
- పోస్టుల సంఖ్య: 1,121
- పోస్టులు: హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) 910, హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) 211.
- ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
- వయోపరిమితి: అన్ రిజర్వ్డ్ 18 నుంచి 25 ఏండ్లు, ఓబీసీలకు 18 నుంచి 28 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 18 నుంచి 30 ఏండ్లు ఉండాలి.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 24.
- లాస్ట్ డేట్: సెప్టెంబర్ 23.
- అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మహిళలు, డిపార్ట్మెంటల్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. అన్ రిజర్వ్డ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. పూర్తి వివరాలకు bsf.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
సెలెక్షన్ ప్రాసెస్
మొదటి ఫేజ్లో ఆర్ఎఫ్ఐడీ ద్వారా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు నిర్వహిస్తారు. రెండో ఫేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ లో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. మూడో ఫేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, డిక్టేషన్ టెస్ట్ నిర్వహిస్తారు.