డిగ్రీ, పీజీ అర్హతతో HILలో మేనేజర్ ఉద్యోగాలు..

డిగ్రీ, పీజీ అర్హతతో HILలో  మేనేజర్ ఉద్యోగాలు..

ఢిల్లీలోని హిందుస్థాన్ ఇన్​సెక్టిసైడ్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 12. 

  • పోస్టుల సంఖ్య: 11
  • పోస్టులు: డిప్యూటీ మార్కెటింగ్ మేనేజర్ 02, అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ 02, మార్కెటింగ్ ఆఫీసర్ 03, అసిస్టెంట్ మేనేజర్ 04. 
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
  • వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 32 నుంచి 42 ఏండ్లు.
  • లాస్ట్ డేట్: సెప్టెంబర్ 12. 
  • సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • పూర్తి వివరాలకు hil.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.