మల్టీపర్పస్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్స్​ పోస్టులకు నోటిఫికేషన్

మల్టీపర్పస్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్స్​ పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కమిషనర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ విభాగం ఆధ్వర్యంలోని మెడికల్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బోర్డ్‌‌‌‌‌‌‌‌ 1520 మల్టీ పర్పస్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్  పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.
అర్హత: ఇంటర్మీడియట్‌‌‌‌‌‌‌‌ వొకేషనల్‌‌‌‌‌‌‌‌ ఉత్తీర్ణత. అభ్యర్థులు మల్టీ పర్పస్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ వర్కర్‌‌‌‌‌‌‌‌ ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేయాలి. మిడ్‌‌‌‌‌‌‌‌వైఫరీ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌లో పేరు నమోదు చేసుకోవాలి. వయసు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. 
సెలెక్షన్​ ప్రాసెస్​: రాతపరీక్ష, పని అనుభవం ద్వారా ఎంపిక ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ఉంటుంది. రాతపరీక్ష ద్వారా 80 శాతం వెయిటేజీ, అభ్యర్థుల గత పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మరో 20 శాతం వెయిటేజీ కేటాయిస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్​ 19 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు రూ. 500 చెల్లించాలి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌, ఖమ్మం, నిజామాబాద్​లో ఎగ్జామ్​ సెంటర్స్​ ఉంటాయి. పూర్తి వివరాలకు www.mhsrb.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.