గాంధీ, టిమ్స్ లో 85 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

గాంధీ, టిమ్స్ లో 85 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: గాంధీ, టిమ్స్ హాస్పిటళ్ల‌లో ఏడాది పని చేసేందుకు కాంట్రాక్ట్ విధానంలో 85 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్రవైద్య, ఆరోగ్య శాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. జనరల్ మెడిసిన్‌లో 35 పోస్టులు, అనస్తీషియాలో 35, టీబీ అండ్ సీడీలో 15 పోస్టులకు ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేశ్‌ రెడ్డి సూచించారు. ఏడాది సీనియర్ రెసిడెన్సీ పూర్తి చేసిన పీజీలు కూడా అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. ఆసక్తి ఉన్నవాళ్లు హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ ఆడిటోరియంలో ఈ నెల 17న ఉదయం11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.

ఒరిజనల్ ఎస్ ఎస్సీ, ఎంబీబీఎస్ , పీజీ, సీనియర్ రెసిడెన్సీ పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రం, క్యాస్ట్ స‌ర్టిఫికెట్, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేష న్ కాపీ ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు ఒక జిరాక్స్ సెట్ వెంట తెచ్చుకోవాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం