THE PARADISE: నాని స్పెషల్ రిక్వెస్ట్‌కు సీఎం రేవంత్ రిప్లై.. అనుమతి విషయంలో ట్విస్ట్!

THE PARADISE: నాని స్పెషల్ రిక్వెస్ట్‌కు సీఎం రేవంత్ రిప్లై.. అనుమతి విషయంలో ట్విస్ట్!

సినిమా అంటే తనకు కేవలం ఓ వృత్తి కాదని.. ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో ఆస్వాదించే ఓ ఎమోషన్ అని చెబుతుంటారు నాని. ఇప్పుడు అదే అనుభూతిని మరోసారి పొందేందుకు ఆయన చేసిన ఓ స్పెషల్ రిక్వెస్ట్ ఆసక్తికరంగా మారింది. బుధవారం సెప్టెంబర్ 23న రాత్రి జరగనున్న‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌కు వచ్చి ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతించాలని నాని కోరారు.

అలాగే, ఈ సందర్భంగా అన్ని భద్రతా నిబంధనలు, అవసరమైన ప్రోటోకాల్స్‌ను తప్పకుండా పాటిస్తామని నాని స్పష్టం చేశారు. ప్రేక్షకుల మధ్య కూర్చొని వాళ్ల స్పందనను ప్రత్యక్షంగా అనుభవించడమే సినిమా తీసిన తర్వాత లభించే అసలైన సంతృప్తి అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. నాని చేసిన స్పెషల్ రిక్వెస్ట్‌కు తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు

స్పందించిన సీఎం రేవంత్

 నాని చేసిన ఈ స్పెషల్ రిక్వెస్ట్‌పై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. భద్రతా నిబంధనలను గౌరవిస్తున్నందుకు నానిని అభినందించారు సీఎం రేవంత్. ఈ క్రమంలోనే తెలంగాణ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన చిత్రానికి నాని చూపిస్తున్న నిబద్ధతను ప్రశంసించారు. అయితే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకుల రద్దీ, ప్రజల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. దరఖాస్తును పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. దీంతో ప్రేక్షకుల మధ్య ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌ను నాని వీక్షిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

పోలీసుల నిర్ణయమే కీలకం..

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షో చూడాలన్న నాని రిక్వెస్ట్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అయితే నాని కోరినట్లుగా నేరుగా అనుమతి ఇవ్వకుండా.. ముందుగా అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  దీనిపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్న నాని నిబద్ధతను అభినందించారు. అదే సమయంలో రద్దీ నియంత్రణ, ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారిక దరఖాస్తు సమర్పించాలని సూచించారు.

ఆ దరఖాస్తును సంబంధిత పోలీసు బృందం పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. అంతేకాదు, తన స్పందనలో సీఎం తెలంగాణ డీజీపీని కూడా ట్యాగ్ చేశారు. దీంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి నాని ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ చూడటానికి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి వస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తుది నిర్ణయం సంబంధిత పోలీసు అధికారుల పరిశీలన తర్వాతే వెలువడనుంది.