హైదరాబాద్ సిటీ పాతబస్తీలోని చార్మినార్ తెలుసు కదా.. ఆ చార్మినార్ పెచ్చులు ఊడి పడ్డాయి. 30 నిమిషాలు ఆగకుండా పడిన కుండపోత వర్షం కారణంగానే ఇలా జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
చారిత్రాత్మక కట్టడం అయిన చార్మినార్ పై భాగంలో ఎలివేషన్ నిర్మాణం ఉంది. ఆ నిర్మాణం నుంచి కొంత భాగం దెబ్బతిన్నది. భారీ వర్షానికి ఇప్పుడు కింద పడింది. లాడ్ బజార్ వైపు ఉన్న మినార్ వైపు ఇది జరిగింది. చార్మినార్ పై నుంచి కింద పడిన పెచ్చులను అధికారులు వెంటనే అక్కడి నుంచి తొలగించారు.
కొంత కాలం క్రితం రెగ్యులర్ మరమ్మతుల్లో భాగంగా తెల్లని సిమెంట్ పూత పూశారు. ఇప్పుడు అదే ఊడిపోయిందని చెబుతున్నారు అధికారులు. విషయం తెలిసిన వెంటనే చార్మినార్ భద్రతా సిబ్బంది అక్కడికి చేరకుని.. కింద పడిన భాగాన్ని తొలగించారు. విషయం ఉన్నతాధికారులకు అందించారు. 1591వ సంవత్సరంలో రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ చార్మినార్ నిర్మించారు.
