హైదరాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ ఘటనలో మరో ఇద్దరు నవజాత శిశువులు మరణించారు. దీంతో మరణాల సంఖ్య ఐదుకు చేరింది. మరికొందరు శిశివులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన చిన్నారుల్లో ఇంద్రవెల్లికి చెందినవారు ఇద్దరు, ఇచ్చోడ, ఉట్నూర్, లింగపూర్ గ్రామాలకు చెందిన శిశువులుగా గుర్తించారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో మంటలు చెలరేగాయి. వార్డులో దట్టంగా పొగ కమ్ముకుని పిల్లలు అస్వస్థతకు గురవ్వగా వెంటనే వారిని మరో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రిము చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు శిశువులు మరణించారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
