నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(యూఆర్‌ఎస్)లలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లలో మొత్తం 1,241 ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి శనివారం(జూన్ 17) నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
ఇందులో 854 పీజీ సీఆర్‌టీ పోస్టులు కాగా.. 273 సీఆర్‌టీ, 77 పీఈటీ, 12 ఎస్‌ఓ ఖాళీలున్నాయి. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోని పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. ఈ నెల 26 నుంచి జులై 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. https://schooledu.telangana.gov.inలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
