ఆర్మీ స్కూల్స్​లో 8700 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

ఆర్మీ స్కూల్స్​లో 8700 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 136 ఆర్మీ పబ్లిక్‌‌ స్కూల్స్​లో 8700 టీచింగ్​ పోస్టులకు ఆర్మీ వెల్ఫేర్‌‌ ఎడ్యుకేషన్‌‌ సొసైటీ నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. పీఆర్‌‌టీ, టీజీటీ, పీజీటీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు జనవరి 28 వరకు ఆన్​లైన్​లో అప్లై చేయాలి. స్క్రీనింగ్‌‌ పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. పరీక్షలో సాధించిన స్కోరుతో సంబంధిత పాఠశాలలవారీ ప్రకటన వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకోవొచ్చు. సెలెక్షన్​ ప్రాసెస్​, ఎగ్జామ్​ ప్యాటర్న్​, సిలబస్​ గురించి ఈ వారం తెలుసుకుందాం..
ఆర్మీ వెల్ఫేర్‌‌ ఎడ్యుకేషన్‌‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్మీ స్కూల్స్ నడుస్తున్నాయి. ఇక్కడ సీబీఎస్‌‌ఈ విధానంలో టీచింగ్​ ఉంటుంది. స్క్రీనింగ్‌‌ టెస్టులో సాధించిన స్కోరు మూడేళ్లపాటు వ్యాలిడిటి ఉంటుంది. ఈలోపు ఆర్మీ పాఠశాలల ప్రకటనలు వెలువడినప్పుడు స్క్రీనింగ్‌‌ టెస్టు మార్కులతో అప్లై చేసుకోవచ్చు. వీరికి ఇంటర్వ్యూ, ఇతర పరీక్షలు నిర్వహించి, విధుల్లోకి తీసుకుంటారు.
సెలెక్షన్​ ప్రాసెస్​:  ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. స్టేజ్​1లో ఆన్‌‌లైన్‌‌ స్క్రీనింగ్‌‌ పరీక్ష నిర్వహిస్తారు. సెకండ్​ స్టేజ్​లో ఇంటర్వ్యూ ఉంటుంది. మూడో దశలో టీచింగ్‌‌ స్కిల్స్, కంప్యూటర్‌‌ ప్రొఫిషియన్సీపై పరీక్ష ఉంటుంది. వీటిని సెలక్షన్‌‌ కమిటీ పరిశీలిస్తుంది. భాషోపాధ్యాయులకైతే ఎస్సే, కాంప్రహెన్షన్‌‌ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి 15 మార్కులు కేటాయించారు. స్క్రీనింగ్‌‌లో అర్హత సాధించినవారికే రెండు, మూడో దశలు ఉంటాయి. టీజీటీ, పీజీటీ పోస్టులకు ఎంపిక కావడానికి సీటెట్‌‌ లేదా టెట్‌‌లో అర్హత సాధించడం తప్పనిసరి. ఆన్‌‌లైన్‌‌ స్క్రీనింగ్‌‌ పరీక్ష రాసుకోవడానికి సీటెట్‌‌ లేదా టెట్‌‌ అవసరం లేదు.
ఎగ్జామ్​ ప్యాటర్న్​: 
పీఆర్‌‌టీ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు పార్ట్‌‌-ఎ పరీక్ష ఉంటుంది. వ్యవధి 90 నిమిషాలు. మొత్తం 80 ప్రశ్నలు వస్తాయి. వీటిని మూడు సెక్షన్లలో అడుగుతారు. సెక్షన్‌‌ ఎలో జనరల్‌‌ అవేర్‌‌నెస్, మెంటల్‌‌ ఎబిలిటీ, కాంప్రహెన్షన్‌‌ల నుంచి 28 ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌‌ బిలో కరెంట్ ఎఫైర్స్​ నుంచి 28 ప్రశ్నలు జాతీయ, అంతర్జాతీయ, భారత్‌‌కు ప్రాధాన్యం ఉన్న అంశాల నుంచి అడుగుతారు. సెక్షన్‌‌ సీలో 24 ప్రశ్నలు బోధన విధానం, ఎన్‌‌ఈపీ, ఇన్ఫోటెక్‌‌ విభాగాల్లో ఉంటాయి.

టీజీటీ, పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్‌‌ ఎతోపాటు పార్ట్‌‌ బి రాయాలి. ఈ విభాగంలో 120 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు.
టీజీటీ పరీక్షలో పార్ట్‌‌ బిలో 4 సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్‌‌ ఎలో సంబంధిత సబ్జెక్టు నుంచి 42 ప్రాథమిక ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌‌ బిలో మరో 42 ప్రశ్నలు సంబంధిత సబ్జెక్టులోనే ఉంటాయి. ఈ రెండు సెక్షన్లలోని ప్రశ్నలూ ఆరు నుంచి పదో తరగతి సిలబస్‌‌ నుంచే ఉంటాయి. సెక్షన్‌‌ సిలో 12 ప్రశ్నలు ఉంటాయి. వీటిని ఇంటర్‌‌ సిలబస్‌‌ నుంచి అడుగుతారు. సెక్షన్‌‌ డిలో 24 ప్రశ్నలు డిగ్రీ సిలబస్‌‌ నుంచి వస్తాయి. 

పీజీటీ పరీక్షలో పార్ట్‌‌ బిలో 3 సెక్షన్ల నుంచి ప్రశ్నలుంటాయి. సెక్షన్‌‌ ఎలో 42 ప్రశ్నలు ఇంటర్‌‌ సిలబస్‌‌ నుంచి ప్రాథమిక స్థాయిలో వస్తాయి. సెక్షన్‌‌ బిలో మరో 42 ప్రశ్నలు ఇంటర్‌‌ సిలబస్‌‌ నుంచే అడుగుతారు. సెక్షన్‌‌ సిలో 36 ప్రశ్నలు పీజీ సిలబస్‌‌ నుంచి ఉంటాయి. 
    ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌‌ తరహాలోనే వస్తాయి. అన్ని పరీక్షల్లోనూ నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. 

నోటిఫికేషన్‌‌
అర్హత: పీజీటీ పోస్టులకు: పీజీ, బీఎడ్‌‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
టీజీటీ పోస్టులకు: గ్రాడ్యుయేషన్, బీఎడ్‌‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
పీఆర్‌‌టీ పోస్టులకు: గ్రాడ్యుయేషన్‌‌తోపాటు బీఎడ్‌‌ లేదా రెండేళ్ల ఎడ్యుకేషన్‌‌ డిప్లొమాలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: ఏప్రిల్‌‌ 1, 2021 నాటికి 40 ఏళ్లలోపు ఉండాలి. బోధనలో అయిదేళ్ల అనుభవం ఉంటే 57 ఏళ్లలోపువాళ్లూ అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తులు: ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. 
చివరితేది: 28 జనవరి
అప్లికేషన్​ ఫీజు: రూ.385
స్క్రీనింగ్‌‌ ఎగ్జామ్​: 19, 20 ఫిబ్రవరి
హాల్​టికెట్స్​: ఫిబ్రవరి 10 నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చు.
రిజల్ట్స్​: 28 ఫిబ్రవరి
ఎగ్జామ్​ సెంటర్స్​: హైదరాబాద్‌‌/ సికింద్రాబాద్‌‌.
వెబ్‌‌సైట్‌‌: www.awesindia.com