ఐటీఐ ట్రేడ్​ అప్రెంటిస్‌‌ ఖాళీల భర్తీకి ECIL నోటిఫికేషన్

ఐటీఐ ట్రేడ్​ అప్రెంటిస్‌‌ ఖాళీల భర్తీకి ECIL నోటిఫికేషన్

హైదరాబాద్‌‌లోని ఎలక్ట్రానిక్స్‌‌ కార్పొరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా లిమిటెడ్‌‌ (ఈసీఐఎల్‌‌) ఐటీఐ ట్రేడ్​ అప్రెంటిస్‌‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

ఖాళీలు: ఎలక్ట్రీషియన్‌‌, ఫిట్టర్‌‌, ఆర్‌‌ అండ్‌‌ ఏసీ, ఎంఎంవీ, టర్నర్‌‌, మెషినిస్ట్‌‌, ఎంఎం టూల్‌‌ మెయింటనెన్స్‌‌, కోపా, ప్లంబర్‌‌, వెల్డర్‌‌, పెయింటర్‌‌ విభాగాల్లో 284 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత స్పెషలైజేషన్‌‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఎన్‌‌సీవీటీ సర్టిఫికేట్‌‌ కలిగి ఉండాలి. వయసు 18 నుంచి -25 ఏళ్లు మధ్య ఉండాలి. అప్రెంటిస్‌‌ డ్యురేషన్​ ఏడాది ఉంటుంది.

ఎంపిక: ఐటీఐ మార్కుల మెరిట్‌‌ ఆధారంగా షార్ట్‌‌లిస్ట్‌‌ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 70% సీట్లు ప్రభుత్వ ఐటీఐ అభ్యర్థులకు, 30% సీట్లు ప్రైవేట్ ఐటీఐ అభ్యర్థులకు కేటాయించనున్నారు. 
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌లైన్‌‌లో అక్టోబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.ecil.co.in వెబ్​సైట్​ సంప్రదించాలి.