జేఎన్టీయూ ఎంబీఏ కోర్సులో అడ్మిషన్లు

జేఎన్టీయూ ఎంబీఏ కోర్సులో అడ్మిషన్లు

హైదరాబాద్‌‌లోని జవహర్‌‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, యూఎస్‌‌ఏలోని సెంట్రల్ మిచిగాన్ విశ్వవిద్యాలయం సహకారంతో 2022-–23 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సులో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది. మొత్తం 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీఈ, బీటెక్‌‌, బీఫార్మసీ, బీఎస్సీ(అగ్రి), బీడీఎస్‌‌, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించాలి. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా సెలెక్షన్​ ప్రాసెస్​ ఉంటుంది. ఆన్​లైన్​లో అక్టోబర్​ 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష నవంబర్​ 4న నిర్వహిస్తారు.