ఎన్‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌ సీఎండీ గోపాల్‌‌‌‌‌‌‌‌రావు రాజీనామా

ఎన్‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌ సీఎండీ గోపాల్‌‌‌‌‌‌‌‌రావు రాజీనామా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు :  నార్తర్న్‌‌‌‌‌‌‌‌ పవర్ డిస్ట్రి బ్యూషన్ కంపెనీ సీఎండీ అన్నమనేని గోపాల్‌‌‌‌‌‌‌‌రావు గురువారం తన పదవికి రాజీనామా చేశారు. రిజైన్​ లెటర్​ను ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శికి పంపించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

రిటైర్డ్ అధికారి గోపాల్‌‌‌‌‌‌‌‌రావును ఎన్‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌ సీఎండీ చేయడంపై  గతంలో విమర్శలు వచ్చాయి. రాజీనామా అనంతరం గోపాల్ రావు మాట్లాడుతూ.. ఈ సుదీర్ఘ కాల ప్రయాణంలో తన పదవి సంతృప్తినిచ్చిందన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క ఉద్యోగికి  ధన్యవాదములు తెలుపుకుంటున్నాని ఆయన పేర్కొన్నారు.