పాల్వంచ, వెలుగు : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని ఎన్ పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ మధు సూదన్ సూచించారు. మంగళ వారం పాల్వంచలోని కేటీపీఎస్ జెన్కో శిక్షణ కేంద్రంలో కొత్తగూడెం సర్కిల్ పరిధిలోని సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
విద్యుత్ ప్రమాదాలను అరికట్టడంతోపాటు తీసుకుంటున్న చర్యలు ట్రాన్స్ ఫార్మర్ల వైఫల్యం, నెలవారీ నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. ఆపరేషన్ చీఫ్ ఇంజినీర్ రాజు చౌహాన్, పాల్వంచ, కొత్తగూడెం డీఈలు నందయ్య, రంగస్వామి, భద్రాచలం డీఈ జీవన్ కుమార్, టెక్నికల్ డీఈ కృష్ణయ్య, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
