అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి : మధుసూదన్

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి : మధుసూదన్
  • ఎన్ పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ మధుసూదన్

ఖమ్మం టౌన్, వెలుగు : వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్​సరఫరా చేయాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(వరంగల్ ఎన్ పీపీడీసీఎల్) ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్, చీఫ్ ఇంజినీర్లు రాజు చౌహన్, అన్నపూర్ణదేవి విద్యుత్ అధికారులకు సూచించారు. గురువారం ఖమ్మం నగరంలోని విద్యుత్ అధికారుల గెస్ట్ హౌస్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ అంతరాయన్ని తగ్గించే విధంగా ఫీడర్, లైన్ల పనులను స్పీడప్ చేయాలన్నారు. సింగిల్ ఫేజ్ ఏబీ స్విచ్ లను అవసరమైన చోట అమర్చాలని చెప్పారు.

సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఓవర్ లోడ్ అవుతున్న డీటీఆర్ ల స్థానంలో అదనంగా పరికరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ విద్యుత్ సప్లైకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఎస్ఈ శ్రీనివాచాచారి, ఏఈలు, ఏడీఈలు, విద్యుత్​అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.