న్యూఢిల్లీ: నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ 30 రకాల కొత్త ఔషధాల ధరలను ఖరారు చేసింది. ఇందులో డయాబెటిస్, గుండె జబ్బులు, విటమిన్ లోపాలకు సంబంధించిన విటమిన్ డి3 ఓరల్ సొల్యూషన్, కాల్షియం, విటమిన్ డి3, మిథైల్‌కోబాలమిన్, ఎల్-మిథైల్‌ఫోలేట్ కాల్షియం, పైరిడాక్సల్-5 ఫాస్ఫేట్ వంటి ఔషధాలు ఉన్నాయి.
ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వు (DPCO) 2013 నిబంధనల ప్రకారం ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయి. నానో డ్రాప్లెట్ రూపంలో ఉండే ఈ విటమిన్ డి3 ఓరల్ సొల్యూషన్ ధరను రూ. 14.91 (ప్రతి మి.లీ. కి) గా నిర్ణయించారు. ఎన్పీపీఏ ఫిక్స్ చేసిన ఈ ధరలకు జీఎస్టీ యాడ్ చేయలేదు. ఔషధ తయారీదారులు/కంపెనీలు ప్రభుత్వం నిర్దేశించిన జీఎస్‌టీని మాత్రమే ప్రాథమిక ధరపై అదనంగా జీఎస్ట్ వసూల్ చేయాలి.
►ALSO READ | పెట్రోల్ డీజిల్ పై ఎగుమతి సుంకాలు తగ్గించిన కేంద్రం... దేశంలో ధరల పరిస్థితి ఏంటి..?
ఎన్పీపీఏ ఖరారు చేసిన ధరల కంటే ఏ కంపెనీ అయినా అధిక ధరలకు విక్రయిస్తే.. సదరు సంస్థలు ప్రభుత్వానికి జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన ఔషధాలు లభించాలని సుదుద్దేశంతో కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్పీపీఏ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
The National Pharmaceutical Pricing Authority has fixed the retail price of 30 drug formulations, including Vitamin D3 Oral Solution, Calcium, Vitamin D3, Methylcobalamin, L-Methylfolate Calcium, Pyridoxal-5 phosphate and others. pic.twitter.com/XzaN6Q8QRM
— ANI (@ANI) May 31, 2026
