తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్

తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్

తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని నందమూరి బాలకృష్ణ అన్నారు.  బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ ఆయన సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో విశేష సేవలందించిన డా. సోమరాజు, కార్డియాలజిస్ట్ నాగేశ్వరరావు, డీఎన్ కుమార్ కార్డియాలజిస్ట్, బీఎన్ ప్రసాద్ ఆర్థోపెడిక్ లను సన్మానించారు.  

ఎన్టీఆర్ ప్రజా జీవితంలోకి వచ్చి, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. భావి తరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలచారని కొనియాడారు.  అనంతరం బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న వైద్య సేవలను వివరించారు.