- రూ.43.2 కోట్లతో 480 ఫ్లాట్ల నిర్మాణం
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ నియోజకవర్గం పోచారంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇందిరమ్మ టవర్లకు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ రూ.43.2 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 480 ఫ్లాట్లను నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతలో రూ.1 లక్ష చెల్లించిన లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి చేతుల మీదుగా లాటరీ పద్ధతిలో ఫ్లాట్ నంబర్లను కేటాయించనున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఫ్లాట్లు పొందిన లబ్ధిదారులందరూ తమ కుటుంబసభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరుకావాలని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
