ఏసీబీ కస్టడీలో నిమ్స్‌‌‌‌‌‌‌‌ లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌.. కొనుగోళ్లు.. నియామకాలపై ఎంక్వైరీ

ఏసీబీ కస్టడీలో నిమ్స్‌‌‌‌‌‌‌‌ లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌.. కొనుగోళ్లు.. నియామకాలపై ఎంక్వైరీ
  • ఆస్తుల పత్రాలు ముందుంచి ప్రశ్నలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌,వెలుగు: నిమ్స్‌‌‌‌‌‌‌‌ మాజీ అడిషనల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ నోరి లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌ ఆస్తుల వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కోర్టు అనుమతితో మూడు రోజులు కస్టడీకి తీసుకుని ఎంక్వైరీ చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించి ప్రశ్నించింది. తొలిరోజు విచారణలో లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌ వ్యక్తిగత, కుటుంబ వివరాలతో పాటు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ వ్యక్తుల వద్ద గుర్తించిన ఆస్తులపై ఆరా తీసినట్లు సమాచారం. సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను ముందుంచి ప్రశ్నించినట్లు తెలిసింది. నిమ్స్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ థియేటర్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగి బార్బర్‌‌‌‌‌‌‌‌ ధన్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌, ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ డ్రైవర్‌‌‌‌‌‌‌‌ గణేశ్‌‌‌‌‌‌‌‌, సెక్యూరిటీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ రామారావుతో ఆయనకు ఉన్న ఆర్థిక లావాదేవీలపైనా వివరాలు సేకరించినట్లు సమాచారం.

కొనుగోళ్లు.. నియామకాలపై ఆరా..

లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌ నిమ్స్‌‌‌‌‌‌‌‌లో చేరినప్పటి నుంచి నిర్వహించిన కార్యకలాపాలు, కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగుల నియామకాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆసుపత్రిలో ఫర్నిచర్‌‌‌‌‌‌‌‌, విలువైన వైద్య పరికరాల కొనుగోళ్ల బిల్లులు, ఇతర ఆధారాలను పరిశీలించినట్లు సమాచారం. కరోనా సమయంలో వెంటిలేటర్లు, డయాలసిస్‌‌‌‌‌‌‌‌ పరికరాలు, కోవిడ్‌‌‌‌‌‌‌‌ ఇంజెక్షన్ల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలపై కూడా ఆయన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నమోదు చేసినట్లు తెలిసింది.