- రాష్ట్ర మాల సంఘాల కొత్త కార్యవర్గం ఏర్పాటు
బషీర్‌బాగ్, వెలుగు : ఎస్సీ వర్గీకరణ, ప్రస్తుత రోస్టర్ విధానం వల్ల మాలలకు విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల లీడర్లు ఆరోపించారు. రిజర్వేషన్లలో మాలలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. మాలల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా చైతన్య యాత్ర చేపట్టి, గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర మాల సంఘాల నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జాక్ చైర్మన్‌గా చెరుకు రాంచందర్, కన్వీనర్‌గా నల్లాల కనకరాజు, వర్కింగ్ చైర్మన్లుగా మంత్రి నర్సింహయ్య, సక్కి గంగాధర్‌ను నియమించారు. కో -చైర్మన్లుగా చేపూరి నర్సింహ, బీసుమల్ల ఆనంద్, సాగే సుమోహన్, నామేశ్వర్రావు, నాను, పూల రవీందర్‌ను ఎంపిక చేశారు. వైస్ చైర్మన్లుగా పంబాల సుధాకర్, బాగరి శివరాజు, గిరిప్రసాద్, పచ్చ అనిత, కనక రామభద్రాలు, డబ్బా రాములు, ప్రభాకర్, జెట్టి చంద్రయ్య, చింతపల్లి శివకుమార్, తిన్నెర పాండు, బాగరి కృష్ణకుమార్, ఏనుబోతుల కరుణలను నియమించారు. చెరుకు రాంచందర్ మాట్లాడుతూ.. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
