మానేరు తీరంలో డంప్ యార్డు ఎత్తేయాలని బతుకమ్మ ఆడుతూ నిరసన

మానేరు తీరంలో డంప్ యార్డు ఎత్తేయాలని బతుకమ్మ ఆడుతూ నిరసన

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మానేరు తీరంలో ఉన్న డంపింగ్ యార్డ్ కు మంటలంటుకుని వెలువడుతున్న పొగతో అవస్థలు పడుతున్నామని, విషపూరితమైన గాలితో అనారోగ్యానికి గురవుతున్నామంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 


కోతిరాంపూర్, అల్కాపూర్ కాలనీ వంటి పలు కాలనీలకు చెందిన మహిళలు మంగళవారం మాస్కులు ధరించి డంప్ యార్డుకు వెళ్లే రోడ్డుకు చేరుకుని బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. డంప్​యార్డు ఎత్తేసి, తమను పొగ బారినుంచి రక్షించాలని కోరారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకుని బతుకమ్మలు రోడ్డుకు అడ్డంగా పెట్టి రాస్తారోకో చేపట్టారు.