పెద్దపల్లి(కరీంనగర్), వెలుగు: ఖరీఫ్ పంటలను కాపాడేందుకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి డీ-83, డీ-86 కెనాల్ ద్వారా పెద్దపల్లి జిల్లాకు మంగళవారం నీటిని విడుదల చేశారు.10 రోజులపాటు ఈ నీటి విడుదల కొనసాగనుంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలానికి ఎస్సారెస్పీ జలాలు చేరుకున్న సందర్భంగా సుల్తానాపూర్ గ్రామంలోని డీ-86 ప్రధాన కాలువలో రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పసుపు, కుంకుమ, పూలు చల్లి ప్రత్యేక పూజలు చేశారు.
ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని వేలాది ఎకరాలకు ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.
