మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలోని నర్సాపూర్– చేగుంట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న తెలంగాణా సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహం మంగళవారం తెల్లవారు జామున ధ్వంసమైంది. విగ్రహం కింద పడిపోయి విరిగి పోయింది. ఈ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న రజక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.
చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని, సీసీ కెమెరాలు పరిశీలించారు. ప్రత్యేక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. కాగా, చాకలి ఐలమ్మ విగ్రహం కోతులు పట్టుకొని ఊగడంతోనే దెబ్బతిన్నట్లు విచారణలో వెల్లడైందని మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్తెలిపారు.
