హైదరాబాద్ మణికొండలో అయ్యప్ప పూజల వేళ అంతులేని విషాదం

హైదరాబాద్ మణికొండలో అయ్యప్ప పూజల వేళ అంతులేని విషాదం

రంగారెడ్డి జిల్లా మణికొండలో విషాద ఘటన జరిగింది. అయ్యప్ప పూజల ఏర్పాట్లలో విద్యుత్ షాక్తో18 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఫ్లెక్సీలు కడుతుండగా ఈ ఘోరం జరిగింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నేడు(నవంబర్ 28, 2026) జరగనున్న అయ్యప్ప స్వామి పూజకు ఏర్పాట్లు చేస్తుండగా ఈ విషాదం జరిగింది.

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ క్వార్టర్స్‌లో ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఫ్లెక్సీలు కడుతుండగా ఈ విద్యుత్ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఉదయ్ (18) అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సాయికి కూడా విద్యుత్ షాక్ తగలడంతో గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలపై విచారణ చేపట్టారు. 

అయ్యప్ప పూజల సందడి ఉండాల్సిన చోట యువకుడి మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్ల ముందే జరిగిన ఈ ప్రమాదంతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే స్పందించిన వారు గాయపడిన సాయిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు.

అయ్యప్ప స్వామి పూజల కోసం ఎంతో ఉత్సాహంగా సాగుతున్న ఏర్పాట్లు ఒక్కసారిగా విషాదాంతమయ్యాయి. కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాల్సిన 18 ఏళ్ల యువకుడు విగతజీవిగా మారడం స్థానికులను కలచివేసింది. భక్తి భావం నిండాల్సిన వేళ.. ఓ కుటుంబంలో అంతులేని శోకం మిగిలింది.