జూబ్లీహిల్స్ , వెలుగు: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అమీర్పేట్మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి కొనసాగుతున్న పనులను సోమవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పరిశీలించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అమీర్‌పేట్‌లోని మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే పనులు చేపట్టామని, సీఎం ఆదేశాల మేరకు పరిశీలించినట్టు చెప్పారు. త్వరలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని ఆయన ప్రకటించారు.
