ఆహార ధాన్యాల ఉత్పత్తిలో.. నంబర్ వన్​లో ఉన్నాం : పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఆహార ధాన్యాల ఉత్పత్తిలో.. నంబర్ వన్​లో ఉన్నాం : పల్లా రాజేశ్వర్ రెడ్డి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: తెలంగాణ ఏర్పడినప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశంలో 15వ స్థానంలో ఉంటే.. ఇప్పుడు నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచామని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాంపల్లిలోని రైతుబంధు సమితి ఆఫీస్​లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, జూన్ 3న నిర్వహించే రైతు దినోత్సవ కార్యక్రమాలపై రైతు బంధు కో ఆర్డినేటర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. పదేండ్ల కాలంలో వ్యవసాయ రంగం అద్భుతమైన పురోగతి సాధించిందన్నారు.

సాగు రంగానికి కల్పిస్తున్న ప్రాధాన్యత కారణంగా పంట ఉత్పత్తిలోనూ దేశంలో రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరగకుండా ముందస్తు వరి సాగు ప్రణాళికలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతుల అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అందుబాటులోకి తెచ్చిందని అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ రఘునందనరావు గుర్తు చేశారు.