హైదరాబాద్, వెలుగు: నదుల అనుసంధానంపై నేషనల్‌వాటర్ డెవలప్మెంట్ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) మరోసారి సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 23వ తేదీ ఢిల్లీలో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ఏర్పాటు చేయనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్పాటిల్ నేతృత్వంలో ఇంటర్ లింకింగ్‌లో భాగమైన రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, అధికారులతో 39వ యాన్యువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం), 24వ నదుల అనుసంధాన స్పెషల్ కమిటీ సమావేశాలను నిర్వహించనున్నారు.
ఈ సమావేశాల్లో గోదావరి కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపైనా చర్చించనున్నారు. తమ డిమాండ్లకు అంగీకరిస్తే.. జీసీ లింక్‌కు ఒప్పుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

