IND vs SA: సిరీస్ నెగ్గడానికి 92 ఏళ్లు పట్టింది.. చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్

IND vs SA: సిరీస్ నెగ్గడానికి 92 ఏళ్లు పట్టింది.. చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్

స్వదేశంలో న్యూజిలాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో చేజిక్కించుకుంది. ఈ విజయంతో 92 ఏళ్లుగా వస్తున్న నిరీక్షణకు తెరపడింది. క్రికెట్ చరిత్రలో కివీస్ జట్టు.. దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌ నెగ్గడం ఇదే తొలిసారి. హామిల్టన్‌, సెడాన్ పార్క్ వేదికగా జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

పోరాడినా.. ఓటమి తప్పలేదు

తొలి టెస్టులో ఘోరంగా ఓడిన దక్షిణాఫ్రియా యువ జట్టు.. రెండు టెస్టులో గట్టి పోటీనిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే, కివీస్ ఆటగాళ్ల అనుభవం ముందు వారి పోరాటం ఎక్కువసేపు నిలవలేదు. రెండో ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే కుప్పకూలి.. కివీస్ ముందు 267 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఆ లక్ష్యాన్ని కేన్ విలియమ్సన్(133*; 260 బంతుల్లో) తన శతకంతో వన్‌సైడ్‌గా మార్చాడు. అతనికి విల్ యంగ్ (60*) చక్కని సహకారం అందించాడు.

అనామక ఆటగాళ్లు 

కీలక ఆటగాళ్లందరూ సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20)తో ఒప్పందాలు చేసుకోవడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు యువ ఆటగాళ్లను కివీస్ పర్యటనకు పంపింది. ఏకంగా ఏడుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను ఈ సిరీస్ కు ఎంపిక చేసింది. కెప్టెన్‌ నీల్ బ్రాండ్‌ సహా అందరూ అనామక ఆటగాళ్లే.

స్కోర్ వివరాలు

  • దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 242 
  • న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 211
  • దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 235
  • న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 269/3