కరీంనగర్ లో షాపుల ఓపెనింగ్ కు సరి-బేసి విధానం

కరీంనగర్ లో షాపుల ఓపెనింగ్ కు సరి-బేసి విధానం

రాష్ట్రప్రభుత్వం లాక్ డౌన్ ను ఈ నెల 29 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆరెంజ్ జోన్లో ఉన్న కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు. షాపులను తెరిచేందుకు సరి-బేసి సంఖ్య విధానాన్ని అమలు చేయనున్నట్లు…నగరపాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి తెలిపారు. నగరంలోని మొత్తం షాపులను ‘ఏ, ‘బీ‘, ‘సీ‘..మూడు కేటగిరీలుగా విభజించినట్టు చెప్పారు.

కేటగిరి ‘ఏ’ లో నిత్యావసర, మద్యం, నిర్మాణ రంగానికి సంబంధించిన షాపులు ఉన్నాయి. వీటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు వీటిని తెరచుకోవచ్చని  తెలిపారు. కేటగిరి ‘బీ’ లో బట్టలు, పాదరక్షల షాపులు ఉన్నాయని.. వీటిని తెరిచేందుకు సరి-బేసి సంఖ్య విధానం అమలు చేస్తామని చెప్పారు. కేటగిరి ‘సీ’లో హోటల్స్, స్కూల్స్, సినిమా హాల్స్, జిమ్స్ ఉన్నాయని.. వీటిని తెరవకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు నగరపాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి.