అల్టిమేట్ ఖో ఖో లీగ్ విన్నర్ ఒడిశా జాగర్‌నట్స్

అల్టిమేట్ ఖో ఖో లీగ్ విన్నర్ ఒడిశా జాగర్‌నట్స్

అల్టిమేట్ ఖో ఖో తొలి సీజన్ విజేతగా ఒడిశా జాగర్‌నట్స్ నిలిచింది. ఫైనల్లో తెలుగు యోధాస్‌ను  ఒక్క పాయింట్‌తో  ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఒడిశా 46–45 తేడాతో తెలుగు యోధాస్‌ను ఓడించింది. విన్నర్  ఒడిశా జాగర్‌నట్స్ కు కోటిరూపాయల ప్రైజ్ మనీ దక్కగా.. రన్నరప్ తెలుగు యోధాస్‌ రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ అందుకుంది.

హోరా హోరీగా..
మ్యాచ్ స్టార్టింగ్ నుంచే హోరా హోరీగా సాగింది. ఫస్ట్ టర్న్‌లో ఒడిశా డిఫెండర్ విశాల్ అద్భుతంగా ఆడాడు. 4 నిమిషాల 23 సెకండ్ల పాటు డిఫెండ్ చేసి 8 బోనస్ పాయింట్లు సాధించాడు. కెప్టెన్ దిపేశ్, దిలీప్ 2.37 నిమిషాల పాటు తప్పించి మరో రెండు పాయింట్లు రాబట్టారు. దీంతో తొలి టర్న్‌లో ఒడిశా 10-10తో  నిలిచింది. ఆ తర్వాత  తెలుగు యోధాస్ అద్భుతంగా ఆడింది. ఆదర్ష్ మోహిత్ 4.12 నిమిషాల పాటు డిఫెన్స్ చేసి పాయింట్స్ సాధించాడు. మొత్తంగా తెలుగు యోధాస్ 10 పాయింట్లు సాధించి ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసేసరికి 20–23తో వెనుకబడింది. మూడో టర్న్‌లో తమదైన అటాకింగ్‌తో 21 పాయింట్లు సాధించిన తెలుగు యోధాస్ 41–27తో భారీ ఆధిక్యం సంపాధించింది. 

అవదుట్ సూపర్ స్కైడైవ్..
ఒడిశా టీమ్ తరఫున సచిన్ భార్గో కీలక పాయింట్లు సాధించాడు. ఇక చివరి టర్న్‌లో లాస్ట్ మినిట్ లీడ్‌లో ఉన్న తెలుగు యోధాస్.. మ్యాచ్ ముగుస్తుందగా పాయింట్స్ కోల్పోయింది. మ్యాచ్‌లో 14 సెకండ్ల టైమ్ మిగిలుందనగా.. అవదుట్ పాటిల్‌ను సూపర్ స్కైడైవ్‌తో మూడు పాయింట్లు సాధించి..ఒడిశాను విజేతగా నిలిపాడు.