ఇంటర్నెట్ కంపెనీల పన్నులను పెంచండి : ఓఈసీడీ

ఇంటర్నెట్ కంపెనీల పన్నులను పెంచండి : ఓఈసీడీ

గూగుల్​, ఫేస్​బుక్​, అమెజాన్​ వంటి పెద్ద పెద్ద డిజిటల్​ కంపెనీలకు వేసే పన్నులను పెంచాలని సైబర్​ నిపుణులు సూచిస్తున్నారు. అందుకు తగ్గట్టు దేశ పన్ను చట్టాల్లో మార్పులు చేయాలంటున్నారు. ఇప్పటికే పెద్ద కంపెనీలు కొన్నేళ్లుగా పన్ను ఎగవేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్​ కంపెనీల పన్ను విధానాలను మార్చాల్సిన అవసరముందని ఆర్గనైజేషన్​ ఆఫ్​ ఎకనామిక్​ కో ఆపరేషన్​ అండ్​ డెవలప్​మెంట్​ (ఓఈసీడీ) బుధవారం ప్రతిపాదించింది. బేస్​ ఎరోషన్​ అండ్​ ప్రాఫిట్​ షిఫ్టింగ్​పై సమ్మిళిత ఫ్రేమ్​వర్క్​ ఆధారంగా పన్నుల్లో మార్పులు చేయాలని చెప్పింది. ఓఈసీడీ/జీ20 దేశాల్లోని భాగస్వాములైన 134 దేశాలు అభిప్రాయం చెప్పాలని సూచించింది. ప్రస్తుతం ఓఈసీడీలో ఇండియా సభ్య దేశం కాదని, కాబట్టి దేశ పన్ను చట్టాల్లో మార్పులు చేయడంలో వేగం పెంచాలని సైబర్​ నిపుణులు కోరుతున్నారు. ‘‘ఇంటర్నెట్​ కంపెనీలపై పన్ను వేయాలని ప్రభుత్వాలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాయి. కానీ ఎలా వేయాలో నిర్ణయం తీసుకోవట్లేదు” అని ప్రముఖ సైబర్​ లా నిపుణుడు, సుప్రీం కోర్టు సీనియర్​ లాయర్​ పవన్​ దుగ్గల్​ అన్నారు. వివిధ దేశాల్లో వ్యాపారం చేస్తున్న ఇంటర్నెట్​ కంపెనీలు పన్నులను కట్టట్లేదని, దాని వల్ల కంపెనీలు బాగా లాభపడుతున్నాయే గానీ దేశానికి ఏం లాభం  లేదని అన్నారు. చైనా, ఫ్రాన్స్​, జర్మనీ దేశాలు ఇప్పటికే ఈ దిశగా చర్యలు తీసుకున్నా ఇండియా ముందుకెళ్లట్లేదని మరో లాయర్​ విరాగ్​ గుప్తా అన్నారు. ఇన్​కమ్​ ట్యాక్స్​ యాక్ట్​, కంపెనీస్​ యాక్ట్​ అండ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ యాక్ట్​లలో మార్పులు చేయాలని సూచించారు. ఇలా చేస్తే మన ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు.