2024లో 8 శాతం వృద్ధికి చాన్స్​ : సీఈఏ నాగేశ్వరన్​ 

2024లో 8 శాతం వృద్ధికి చాన్స్​ : సీఈఏ నాగేశ్వరన్​ 

న్యూఢిల్లీ: బలమైన వృద్ధి నేపథ్యంలో 2024 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 8 శాతానికి చేరే అవకాశం ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత నాగేశ్వరన్ బుధవారం అన్నారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మూడు క్వార్టర్లో భారీ వృద్ధి నమోదయిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్​ చేశారు.  డిసెంబర్ 2023తో ముగిసిన మూడవ క్వార్టర్​లో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 8.4 శాతం పెరిగింది. రెండవ క్వార్టర్​లో జీడీపీ వృద్ధి 7.6 శాతం కాగా, మొదటి క్వార్టర్​లో 7.8 శాతం ఉంది.

ఢిల్లీలో బుధవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో సీఈఏ మాట్లాడుతూ ఐఎంఎఫ్ 2024 ఆర్థిక సంవత్సరానికి 7.8 శాతం వృద్ధి రేటును అంచనా వేసిందని, మొదటి మూడు త్రైమాసికాలలో వృద్ధిని పరిశీలిస్తే, వృద్ధి రేటు 8 శాతానికి చేరే చాన్సు ఉందని వివరించారు.  ఆర్​బీఐ అంచనా 7.5 శాతం కంటే ఇది ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, అంతర్జాతీయ ద్రవ్య నిధి 6.8 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నదని, అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 ఆర్థిక సంవత్సరానికి శాతం ఏడు శాతం జీడీపీ వృద్ధిని అంచనా వేస్తోందని నాగేశ్వరన్​ అన్నారు.  అయితే, రుతుపవనాలు ఎలా ఉంటాయనేది ముఖ్యమని స్పష్టం చేశారు.