ఎల్‌‌ అండ్ టీ ప్రాఫిట్ రూ.4,396 కోట్లు

ఎల్‌‌ అండ్ టీ ప్రాఫిట్ రూ.4,396 కోట్లు
  •     షేరుకి రూ.28 డివిడెండ్‌‌ 

న్యూఢిల్లీ: లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌‌ అండ్‌‌ టీ) ఈ ఏడాది మార్చితో ముగిసిన  క్వార్టర్ (క్యూ4) లో రూ.4,396 కోట్ల నికర లాభాన్ని, రూ.67,078.7 కోట్ల రెవెన్యూని సాధించింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే కంపెనీ నికర లాభం 10 శాతం (రూ.3,9987 కోట్ల నుంచి)  పెరగగా, రెవెన్యూ 15 శాతం (రూ.58,335 కోట్ల నుంచి)  వృద్ధి చెందింది. ఇబిటా (పన్నులు, వడ్డీల ముందు ప్రాఫిట్‌‌) క్యూ4 లో రూ.7,234 కోట్లకు చేరుకుంది. ఫేస్ వాల్యూ రూ.2 ఉన్న ఒక్కో షేరుపై రూ.28 ఫైనల్ డివిడెండ్ (2023–24 కి గాను) ఇవ్వాలని ఎల్ అండ్ టీ బోర్డు నిర్ణయించింది.  

కిందటేడాది ఆగస్టులో  ఇచ్చిన  రూ.6 స్పెషల్ డివిడెండ్‌‌కు ఇది అదనం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో షేరుకి రూ. 24 ఫైనల్ డివిడెండ్‌‌ను కంపెనీ ఇచ్చింది. వచ్చే నెల 20 న జరగనున్న యాన్యువల్ జనరల్ మీటింగ్‌‌లో  ఫైనల్ డివిడెండ్‌‌పై ఇతర షేరు హోల్డర్ల అనుమతి తీసుకోనున్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌‌ అండ్ టీ రెవెన్యూ 21 శాతం వృద్ధి చెంది (ఏడాది ప్రాతిపదికన)   రూ. 2,21,113 కోట్లకు, నికర లాభం 25 శాతం పెరిగి రూ.13,059 కోట్లకు చేరుకుంది.