గూగుల్​ వాలెట్​ వచ్చేసింది  

గూగుల్​ వాలెట్​ వచ్చేసింది  

న్యూఢిల్లీ: టెక్ టైటాన్ గూగుల్ బుధవారం భారతదేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ వాలెట్ యాప్‌‌ను ప్రారంభించింది. బోర్డింగ్ పాస్‌‌లు, లాయల్టీ కార్డ్‌‌లు, ఈవెంట్ టిక్కెట్లు  పబ్లిక్ ట్రాన్స్‌‌పోర్ట్ పాస్‌‌లు వంటి వాటిని సేవ్​చేయడానికి దీనిని వాడుకోవచ్చు. భారతదేశంలో బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ డిజిటల్ వాలెట్, ప్రస్తుతం ఉన్న పేమెంట్ యాప్ గూగుల్ పేకి కాంప్లిమెంటరీ సర్వీస్‌‌గా ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

గూగుల్​వాలెట్​ కోసం ఎయిర్​ఇండియా, ఇండిగో, ఫ్లిప్​కార్ట్​, పైన్​ల్యాబ్స్​, కొచ్చి మెట్రో, పీవీఆర్​ఐనాక్స్​వంటి 20 భారతీయ బ్రాండ్‌‌లతో గూగుల్​ భాగస్వామ్యం కుదుర్చుకుంది.  రాబోయే నెలల్లో మరిన్ని భాగస్వాములను చేర్చుకోనున్నట్లు తెలిపింది. సినిమా/ఈవెంట్ టిక్కెట్లను కూడా దీంతో  సేవ్ చేయవచ్చు.