10 సీట్లు గెలిస్తే దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ : అమిత్ షా

10  సీట్లు గెలిస్తే దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ : అమిత్ షా

తెలంగాణలో 10 ఎంపీ సీట్లు.. దేశంలో 400 సీట్లు గెలుస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.   భువనగిరిలో బూర నర్సయ్యకు మద్దతుగా ప్రచారం చేసిన అమిత్ షా... కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంలా  వాడుకుంటుందని విమర్శించారు.   ఏ అసదుద్దీన్..బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్..ఈ  మూడు ఒక్కటేనని చెప్పారు.  ఎంఐఎంను ఆపేది బీజేపీ ఒక్కటేనన్నారు అమిత్ షా.. ఈ మూడు పార్టీలు   హైదరాబాద్ విమోచన దినాన్ని జరపనివ్వరు.. సీఏఏ ను అమలు చెయ్యనియ్యరని విమర్శించారు. 

ఈ ఎన్నికలు రాహుల్ గాంధీకి, మోదీకి మద్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నిక ఓట్ జిహాద్,అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నిక. రాహుల్ చైనీస్..మోదీ ఇండియన్ గ్యారంటీలకు మధ్య జరుగుతున్న ఎన్నిక. ఈ మూడు విడుతల్లో ఇప్పటికే  200 సీట్లకు చేరువయ్యాం..400 సీట్లకు చేరువవ్వాలి. దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ నినాదాలే వినిపిస్తున్నాయి. బీజేపీకి 400 సీట్లు రావాలా?వద్దా. మోడీ మూడో సారి పీఎం కావాలా? వద్దా.  భువనగిరిలో రాహుల్ చెంచాకు టికెట్ ఇచ్చారు.   కాంగ్రెస్ కు పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు. అబద్ధాలతో కాంగ్రెస్ గెలవాలని చూస్తోంది.  రిజర్వేషన్లపై కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోంది. మోదీ గత పదేళ్ల రిజర్వేషన్ల జోలికి వెళ్ల లేదు.  తెలంగాణలో10 సీట్లిస్తే ముస్లీం రిజర్వేషన్లను తొలగించి ఎస్సీ,ఎస్టీ ఓబీసీలకు ఇస్తాం..రేవంత్ చూస్కో రాష్ట్రంలో 10 సీట్లు గెలుస్తాం అని అమిత్ షా అన్నారు. 

రాహుల్ బాబా ఇచ్చే గ్యారంటీలు చెల్లవు.  మోదీ ఏం చెబితే అదే చేస్తారు. తెలంగాణలో రాహుల్ బాబా 2లక్షల రైతు రుణమాఫీ చేయలేదు. విద్యార్థులకు ఫ్రీ స్కూటీ, వరిధాన్యంపై బోనస్. రైతుకూలీలకు ఏడాదికి 12 వేలు ఇవ్వలేదు.  ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణాలు చేపట్టలేదు. కాంగ్రెస్ ఎప్పటికీ తన హామీలను నెరవేర్చేలేదు అని అమిత్  విమర్శించారు.

మోదీ పదేళ్లలో  టెర్రరిజం,నక్సలిజం లేకుండా చేశారు.  భువనగిరిలో చేనేత పరిశ్రమకు  మోదీ చాలా చేశారు.  140 కోట్లతో భువనగిరిలో  జాతీయ రహాదారి నిర్మించారు.  టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారు.  బీబీ నగర్ లో ఎయిమ్స్ ఏర్పాటు చేశాం.కొమురవెళ్లిలో అత్యాధునిక రైల్వే స్టేషన్ నిర్మిస్తాం.  రాష్ట్రంలో 10 సీట్లు ఇస్తే దేశంలో తెలంగాణను  నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ది చేస్తామని చెప్పారు అమిత్ షా.