VD14: శపించబడిన భూమి నుండి వచ్చిన యోధుడిగా విజయ్ దేవరకొండ

VD14: శపించబడిన భూమి నుండి వచ్చిన యోధుడిగా విజయ్ దేవరకొండ

పుట్టినరోజున వరుస అప్డేట్స్ తో ఫాన్స్ ను ఖుషీ చేస్తున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ఇప్పటికే.. దర్శకుడు రవి కిరణ్ కోలాతో చేస్తున్న పాన్ ఇండియా మూవీ గురించి అప్డేట్ ఇచ్చిన విజయ్.. తాజాగా మరో కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. టాక్సీవాలా, శ్యామ్ సింగారాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యన్(Rahul Sankrithyan) తెరకెక్కిస్తున్నారు. 

పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో యుధుడిగా కనిపించనున్నాడు విజయ్ దేవరకొండ. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ఆసక్తికర పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో ఓ వీరుడి విగ్రహాన్ని చూపిస్తూ.. శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ.. అనే క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు.. 1854 నుంచి 1873 సంవత్సరం మధ్య కాలంలో ఈ ఈ సినిమా కథ జరుగుతుందని పోస్టర్ పై ప్రకటించారు.  

మన ఇతిహాసాలు రాయబడలేదు, అవి యోధుల రక్తంలో కలిసిపోయి ఉన్నాయంటూ VD14 ఈ సినిమాను ప్రకటించారు మేకర్స్. ఈ ఒక్క పోస్టర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.