
ఎన్డీఏ తో ఎన్నికల సంఘం కుమ్మక్కై ఓట్ చోరీకి సహకరిస్తోందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్న తరుణంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫేక్ ఓట్ల అంశం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఒకే అడ్రెస్ పై భారీగా ఓటర్లు నమోదైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒకే ఫ్లాట్, ఒకే ఇంటి అడ్రస్ లలో భారీగా ఓట్లు నమోదయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందని వివిధ పార్టీలు విమర్శలకు దిగాయి.
ఫేక్ ఓటర్ల నమోదు ఆరోపణలపై జిల్లా ఎన్నికల అధికారి సోమవారం (అక్టోబర్ 13) స్పష్టతనిచ్చారు. ఆరోపణలు వస్తున్నట్లుగా కొత్తగా ఎవరినీ ఓటర్లుగా నమోదు చేయలేదని చెప్పారు. 2023 జనరల్ అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓటర్ లిస్ట్ లో ఉన్న ఓటర్లే ఇప్పుడు ఉన్నారని తెలిపారు.
►ALSO READ | జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. తొలిరోజు 10 నామినేషన్లు.. ఏ ఏ పార్టీల అభ్యర్థులు దాఖలు చేశారంటే..
ఒక అడ్రెస్స్ పైన ఉన్న అపార్టుమెంట్ లో 15 ఫ్లాట్స్ ఉండటం తో భారీగా ఓటర్లు ఉన్నట్లు కనిపిస్తుందని అన్నారు. 2023 నుంచి అక్కడ ఉన్న ఓట్లే తప్ప కొత్తగా ఓట్లు యాడ్ చేయలేదని తెలిపారు. 8-3-231/B/160 అపార్టుమెంట్ లో 15 ఫ్లాట్స్ ఉన్నాయని.. ఈ అడ్రస్ పై 43 ఓట్లున్నట్లు తెలిపారు.