
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక సందడి మొదలైంది. సోమవారం (అక్టోబర్ 13) నామినేషన్లకు తొలిరోజు కావడంతో ఔత్సాహిక అభ్యర్థులు నామినేషన్లు వేశారు. తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మొదటి రోజు 10 నామినేషన్లు దాఖలయ్యాయి.
నామినేషన్ వేసిన వారిలో ఇద్దరు రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు ఉండగా.. 8 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. తెలంగాణా పునర్నిర్మాణ సమితి తరఫున పూస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేయగా.. నవతరం పార్టీ నుంచి అర్వపల్లి శ్రీనివాస రావు నామినేషన్ వేశారు.
స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చలిక చంద్ర శేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్ తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.
షెడ్యూల్ ప్రకారం 2025, అక్టోబర్ 13వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు రిటర్నింగ్ అధికారి. షేక్ పేట్ ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభం అయ్యింది. అక్టోబర్ 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 22వ తేదీన దాఖలైన నామినేషన్ పరిశీలన ఉంటుంది. 24వ తేదీ వరకు నామినేషన్ విత్ డ్రా.. ఉపసంహరణకు గడువు ఉంది.
►ALSO READ | ఇండియాలో రూ.15వేల కోట్లు పెట్టుబడి ప్రకటించిన ఫాక్స్‌కాన్.. 14వేల కొత్త జాబ్స్..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయిన రోజునే.. సోమవారం ఫస్ట్ నామినేషన్ దాఖలు అయ్యింది. సిలివేరు శ్రీకాంత్ అనే వ్యక్తి రెండు సెట్ల నామినేషన్ పత్రాల దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు సిలివేరు శ్రీకాంత్.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత ఫైనల్ అయ్యారు. బీజేపీ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గోపీనాథ్ భార్య సునీత బరిలోకి దిగుతున్నారు.