కాశీబుగ్గ, వెలుగు: రానున్న యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు ముందస్తు సన్నాహాలు పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణితో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. యాసంగి 2025-–26 ధాన్యం సేకరణ, 2024-–25 సీఎంఆర్ డెలివరీ, ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ పత్రాల సమర్పణ అంశాలపై కలెక్టర్ సమీక్షించి, సూచనలు చేశారు.
