కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని హెచ్ పీ గ్యాస్ గోదాం దగ్గర ఆదివారం నో స్టాక్ బోర్డ్ పెట్టారు. ఏజెన్సీ నిర్వాహకులు ఆఫీస్ కు తాళం వేసి వెళ్లారు. దీంతో వినియోగదారులందరూ నిరాశతో వెనుదిరిగారు.
ఏజెన్సీ నిర్వాహకుడు జానకి రావును సంప్రదించగా శనివారం సాయంత్రం గ్యాస్ స్టాక్ అయిపోయిందని, ఇండెంట్ పెట్టామని చెప్పారు. సోమవారం గ్యాస్ ఏజెన్సీ కి స్టాక్ రాగానే పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రజలు వదంతులు, పుకార్లు నమ్మి అనవసరంగా ఇబ్బంది పడొద్దని సూచించారు.
