రామప్ప పరిసరాల్లోని జైన గుడిని పరిరక్షించాలి.. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో స్థానం

రామప్ప పరిసరాల్లోని జైన గుడిని పరిరక్షించాలి.. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో స్థానం

వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న పాలంపేటలోని రామప్ప(కాకతీయ రుద్రేశ్వర) టెంపుల్  పరిసరాల్లోని 13వ శతాబ్దానికి చెందిన వర్ధమాన మహావీరుడి జైన గుడిని పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్  ఇండియా ఫౌండేషన్  సీఈవో ఈమని శివనాగిరెడ్డి, టార్చ్  సంస్థ కార్యదర్శి అరవింద్  ఆర్య కోరారు. 

ఆదివారం రామప్ప పరిసరాల్లోని కాకతీయ ఆనవాళ్లను పరిశీలించి, జైన ఆలయాన్ని అధ్యయనం చేశారు. రామప్ప ఆలయం సమీపంలోని రెండు సమకాలీన ఉప ఆలయాలను రక్షిత కట్టడాల జాబితాలో చేర్చిన కేంద్ర పురావస్తు శాఖ అధికారులను అభినందించారు. వాటితో పాటు జైన గుడిని కూడా ఆ జాబితాలో చేర్చాలని కోరారు.