అక్రమ కట్టడాలపై అధికారుల కొరడా.. మల్లారెడ్డి అల్లుడి కాలేజీలో కూల్చివేతలు..

అక్రమ కట్టడాలపై అధికారుల కొరడా.. మల్లారెడ్డి అల్లుడి కాలేజీలో కూల్చివేతలు..

హైదరాబాద్ లో నిర్మించిన అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా ఝులుపుతున్నారు. దుండిగల్ పరిధిలో అక్రమ కట్టడాలను మున్సిపల్, ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు శాఖ అధికారులు నేలమట్టం చేస్తున్నారు. గతంలో చిన్నదామర చెరువులో ఎరోనాటికల్, MLRIT కళాశాలలో  స్థలాలు ఆక్రమించినట్లుగా ఫిర్యాదులు రావడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతం అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు.

 ఆక్రమణలు ఉన్నట్లు నిర్ధారించిన కలెక్టర్ అధికారులకు కూల్చివేతలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ గౌతం ఆదేశాలతో గండిమైసమ్మ మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులు. ఈరోజు తెల్లవారుజాము నుంచే భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు.