ఆయిల్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు మరో సారి షాక్ ఇచ్చాయి. జులై 4న సిలిండర్ ధరను మరో సారి పెంచి వ్యాపారుల చెవిన మరో పిడుగులాంటి వార్త వినిపించాయి. వాణిజ్య సిలిండర్‌పై రూ.7 పెంచినట్లు కంపెనీలు తెలపగా.. తాజా నిర్ణయంతో 19 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,773 నుంచి రూ.1,780 వరకు ఉంది. కోల్‌కతాలో రూ.1,902, ముంబయిలో 1,740, చెన్నైలో రూ.1,952 గా ఉన్నాయి. జూన్‌లో వాణిజ్య సిలిండర్‌పై రూ.83.50 తగ్గించారు.
Also Read :-గ్రీన్ హాట్ : పచ్చి మిర్చి కిలో రూ.400
గృహ వినియోగదారులకు ఊరట..
వాణిజ్య సిలిండర్ ధర పెంచడంతో ఆందోళన చెందిన గృహ వినియోగదారులకు ధర పెంపుదల లేకపోవడంతో ఉపశమనం లభించింది. చివరగా మార్చిలో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ రూ.50 పెరిగింది. ప్రస్తుతం వీటి ధర ఢిల్లీలో రూ.1,103, కోల్‌కతాలో రూ.1,129 గా ఉంది.
