గ్రీన్ హాట్ : పచ్చి మిర్చి కిలో రూ.400

గ్రీన్ హాట్ : పచ్చి మిర్చి కిలో రూ.400

దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు టమాటా సరసన పచ్చిమిర్చి, అల్లం కూడా వచ్చి చేరినట్టు తెలుస్తోంది. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో మిర్చి, అల్లం ధరలు కిలోకు దాదాపు రూ. 400 వరకు పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. చెన్నైలో పచ్చిమిర్చి కిలో రూ. 100,  కాగా, కోల్‌కతాలో రూ. 350కి చేరినట్టు నివేదించింది.

Also Read : తొమ్మిదో టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇండియా గురి..నేడు కువైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘శాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గత కొద్ది రోజులుగా మిర్చి రాక బాగా పడిపోవడమే ఈ పెరుగుదలకు కారణమని కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. మునుపటి వారంలో, పచ్చిమిర్చి పరిమాణం కేవలం 80 టన్నులకు తగ్గింది. అయితే చెన్నైలో రోజువారీ అవసరాలు దాదాపు 200 టన్నులుగా ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక నుంచి వచ్చిన వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే, పచ్చిమిర్చి సరఫరా తక్కువగా ఉండటంతో డిమాండ్ పెరగడంతో పాటు ధరలు అనూహ్యంగా పెరిగాయి.

ఆంద్రప్రదేశ్‌లోని రైతులు గత పంటలో మిర్చికి మంచి ధర లభించకపోవడంతో ఇతర పంటల సాగుకు మళ్లారు. దీంతో కోయంబేడు మార్కెట్‌కు ప్రధానంగా కర్ణాటక నుంచి వచ్చే పచ్చిమిర్చి. మిరపకాయలు, అల్లం ధరలు కాకుండా, పచ్చి బఠానీలు కూడా చాలా ఖరీదైనవిగా మారాయి. కిలో రూ.280 వరకు రిటైల్ అవుతున్నాయి. ప్రజలు కొనుగోలు చేయడం కొనసాగిస్తున్నందున ధర పెరిగినప్పటికీ డిమాండ్ (మిర్చి) ఎక్కువగానే ఉంటుందని మరో వ్యాపారి తెలిపారు.