టీనా అంబానీకి మళ్లీ ఈడీ సమన్లు.. మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీ భార్యకు షాక్

టీనా అంబానీకి మళ్లీ ఈడీ సమన్లు.. మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీ భార్యకు షాక్

మనీలాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ భార్య టీనా అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ సమన్లు జారీ చేయనుంది. నిన్న ఢిల్లీలో విచారణకు హాజరుకా వాలని ఈడీ పిలిచినా, టీనా అంబానీ రాలేదు. దీంతో త్వరలోనే మరోసారి సమన్లు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. న్యూయార్క్ మాన్హాటన్లో లగ్జరీ కండోమినియం కొనుగోలుకు సంబంధించిన డబ్బు లావాదేవీలపై ఈడీ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. 

ఆర్థిక లావాదేవీల దారి తెలుసుకునే కోణంలో టీనా అందానీని ప్రశ్నించేందుకు నిర్ణయిం చినట్లు తెలుస్తోంది. అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్పి బ్యాంకు మోసాలు, ఆర్ధిక అవకతవకల ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల ఈడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. కేసులలో భాగంగానే టీనా అంబానీని విచారించనున్నట్లు అధికారులు తెలిపారు.