జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లాలో ఆయిల్‌పామ్ గెలల సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉద్యాన శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ఆధ్వర్యంలో మార్చి 24 నుంచే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోళ్లు సాగుతున్నాయి. ఇప్పటివరకు 22 మంది రైతుల నుంచి 17.275 మెట్రిక్ టన్నుల గెలలను కొనుగోలు చేసి.. రూ. 3,92,335 రైతుల ఖాతాల్లో జమచేసినట్లు జిల్లా ఉద్యాన అధికారి లత తెలిపారు.
ప్రస్తుతం తక్కువ దిగుబడి ఉండటంతో కంపెనీ సిబ్బందే నేరుగా తోటల వద్దకు వెళ్లి గెలలను సేకరిస్తున్నారు. జూన్, జూలై నెలల్లో ఉత్పత్తి పెరిగే అవకాశం ఉన్నందున అప్పుడు మరిన్ని కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని కంపెనీ జీఎం మురళీధర్ తెలిపారు.

