యుద్ధం కొనసాగితే.. ఆయిల్ ధర 150 డాలర్లకు

యుద్ధం కొనసాగితే.. ఆయిల్ ధర 150 డాలర్లకు

న్యూఢిల్లీ: అమెరికా–-ఇరాన్ దేశాల మధ్య  ఉద్రిక్తతలు  పూర్తిస్థాయి యుద్ధంగా మారితే ముడిచమురు ధరలు బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు ఏకంగా 150 డాలర్లకు  చేరొచ్చని  ఆయిల్ మార్కెట్ ఎనాలసిస్ కంపెనీ రిస్టాడ్ ఎనర్జీ హెచ్చరించింది. ఆరు గల్ఫ్ దేశాలకు చెందిన రోజుకు 1.18 కోట్ల బ్యారెల్స్ చమురు సరఫరా నిలిచిపోవడంతో ఆయిల్ సంక్షోభం నెలకొందని తెలిపింది. 

ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల  బ్రెంట్ ధర ఒక్కసారిగా బ్యారెల్‌‌‌‌‌‌‌‌ 94.5 డాలర్లకు  పెరిగింది.  అమెరికా తన వ్యూహాత్మక నిల్వల నుంచి రికార్డు స్థాయిలో చమురును విడుదల చేయడం, చైనా దిగుమతులు తగ్గడం,  రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురు  హార్మూజ్ జలసంధి నుంచి కాకుండా సౌదీ అరేబియా యాన్బు రేవు ద్వారా తరలుతుండటం వల్ల ధరలు విపరీతంగా పెరగలేదు.