పాముకాటుతో వృద్ధురాలు మృతి.. నల్గొండ జిల్లా కట్టంగూరులో ఘటన

పాముకాటుతో వృద్ధురాలు మృతి.. నల్గొండ జిల్లా కట్టంగూరులో ఘటన

కట్టంగూర్(నకిరేకల్), వెలుగు: నల్గొండ జిల్లా కట్టంగూర్  మండల కేంద్రానికి చెందిన ఓ వృద్ధురాలు పాముకాటుతో చనిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్  కాలనీకి చెందిన మైనం ఎల్లమ్మ (65) బుధవారం తన ఇంట్లో కూర్చొని ఉండగా పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఎల్లమ్మ చనిపోయింది. మృతురాలి కొడుకు మైనం రాజేశ్​ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.